ప్రసిద్ధమైన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్ధానికి సమయం ఆసన్నమైంది. దీనికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆలయం వద్ద పంచమి తీర్ధం ఏర్పాట్లను కలెక్టర్ వెంకట రమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీవీఎస్వోతో కలిసి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. పంచమి తీర్ధానికి హజరయ్యే భక్తులు సేద తీరేలా మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించే విథంగా చర్యలు తీసుకున్నామన్నారు. 50వేల మంది భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు చేశామని టీటీడీ  ఈవో ధర్మారెడ్డి వివరించారు. చక్రస్నానం తరువాత భక్తులను పుష్కరణిలోకి అనుమతిస్తామని టీటీడీ  ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రెండు వేల ఆరువందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని టీటీడీ  ఈవో ధర్మారెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: