ఏపీ పోలీసులకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. సామాజిక మాధమాల్లో  విమర్శిస్తూ పోస్టులు పెట్టడం.. సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టినట్లు ఎలా అవుతుందని పోలీసులను ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారన్న కారణంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీసులు... గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన గోపికృష్ణపై పోలీసులు 2020 మేలో కేసు నమోదు చేశారు.

ఈ కేసును పిటిషనర్  తరఫు న్యాయవాది కోటేశ్వరీదేవి వాదించారు. వాస్తవాలను పరిశీలించకుండా పోలీసులు పిటిషనర్ పై కేసు పెట్టారని వాదించారు. టీడీపీ సానుభూతిపరులను వేధించడం కోసం తప్పుడు ఫిర్యాదు చేశారని వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు పిటిషనర్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటుకావని తేల్చిచెప్పింది. కేసును కొట్టేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పాలకొల్లు  కోర్టులో జరుగుతున్న కేసును కూడా రద్దు చేసింది. సామాజిక మాధ్యమ పోస్టు ఒక వేళ పరువునష్టం కలిగిస్తే బాధితులే ఫిర్యాదు చేస్తారని కోర్టు కామెంట్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: