చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించిందా.. రోజూ అక్కడ వేల సంఖ్యలో కరోనాతో చనిపోతున్నారా.. అంటే అవునంటోంది ఆ దేశంలోని ఓ సంస్థ.. చైనాలో వారం వ్యవధిలోనే 13 వేల మంది కొవిడ్ వ్యాధులతో మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించడం కలకలం రేపుతోంది. కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరి శ్వాస వ్యవస్థ విఫలమై 681 మంది మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మరో 11, 977 మంది కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల కారణంగా మరణించారని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

అయితే.. కరోనాతో ఇళ్ల వద్ద మృతి చెందిన వారి వివరాలను మాత్రం చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించలేదు. నూతన సంవత్సర సెలవుల వేళ దేశవ్యాప్తంగా  చైనీయులు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. సెలవుల్లో చైనాలో రోజుకు 30 వేలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు కూడా అంచనా వేస్తున్నాయి. చైనాలో ఇప్పటికే మెజారిటీ జనాభా కరోనా బారిన పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: