బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. ఎస్. ప్రవీణ్ కుమార్ పై.. బీఆర్‌ఎస్‌  నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ చౌహన్ ఖండించారు. ప్రవీణ్ కుమార్ పై ప్రజల ఆదరణ చూసి... అధికార పార్టీ నేతలకు నిదుర పట్టడం లేదని... బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ చౌహన్ అన్నారు. బీఆర్ఎస్‌ ఎమ్యెల్యే గువ్వల బాల్ రాజ్ మాయవతిపై మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ చౌహన్ అన్నారు. గువ్వల రాజ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని... ఆయనతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు మాట్లాడిపిస్తున్నారని వెంకటేష్ చౌహన్  తెలిపారు.


ప్రగతిభవన్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ను బాలరాజ్ తో చదివించారని... గురుకులాల్లో పేద పిల్లలను తీర్చిదిద్దిన వ్యక్తి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని వెంకటేష్ చౌహన్ గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ను ప్రశంసించారని... గువ్వల బాల్ రాజ్ కు అది కనపడలేదా అని వెంకటేష్ చౌహన్  ప్రశ్నించారు. భాజపా  అమ్ముడుపోవడానికి సిద్ధమై అడ్డంగా దొరికిన గువ్వల బాల్ రాజ్.... స్వేరోస్ గురించి చాలా అవమానంగా మాట్లాడారని వెంకటేష్ చౌహన్  పేర్కొన్నారు. పేద పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలకు వచ్చారని... ఒక్క రోజైనా సోషల్ వెల్వేర్ హాస్టళ్ళకు వెళ్లి చూశావా అని వెంకటేష్ చౌహన్  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RSP