పర్యావరణం, మానవాళి, పశుపక్ష్యాదుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే జన్యు మార్పిడి ఆవాలు పంట సాగుకు కేంద్రం ఇచ్చిన అనుమతులు ఇవ్వడం వివాదంగా మారింది. వీటిని  వ్యతిరేకించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ పిలుపునిచ్చారు. జన్యు మార్పిడి ఆవాలు, ఇతర ఆహార పంటలు - ప్రమాదాలు వంటి అంశాలపై విస్తృతంగా కోదండరామ్ చర్చించారు. 

ఫిబ్రవరి 9న బీటీ వంకాయపై ప్రజా ఉద్యమం గుర్తు చేసుకుంటూ జీఎం పంటల విషయంపై దేశవ్యాప్తంగా రైతులుసహా అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని.. జన్యు మార్పిడి పంటల వల్ల ఆరోగ్యం, పర్యావరణపై పడే ప్రభావాలుసహా రైతుల చేతి నుంచి విత్తనాలు పేటెంట్ల ద్వారా బహుళ జాతి కంపెనీల చేతిలోకి వెళ్ళిపోవడం వంటి ప్రమాదాలు ఉంటాయని కోదండరామ్ ప్రస్తావించారు. తాజాగా బడ్జెట్‌లో ఆయిల్‌పాం సాగుకు 1000 కోట్ల రూపాయలు కేటాయించిన సర్కారు... గతంలో పాలిహౌస్ టెక్నాలజీ కోసం 1000 కోట్ల రూపాయలు వెచ్చించినా ఫలితం రాలేదని కోదండరామ్ న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: