ఒక పక్క ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో ఉగ్రవాదులను వరుసగా కాల్చి చంపుతున్నా సరే జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఉగ్రవాదులు ఏ విధంగా కూడా వెనక్కు తగ్గడం లేదు. ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట ఏదోక చర్యకు పాల్పడుతునే ఉన్నారు. ఇక బాంబులను కూడా రోడ్ల మీద అమర్చే ప్రయత్నం ఉగ్రవాదులు చేస్తున్నారు. 

 

తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని బందీ పోరా జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన బాంబులను సైనికులు గుర్తించి దాన్ని నిర్వీర్యం చేసారు. జమ్మూ కాశ్మీర్ బందిపోరా జిల్లాలోని బండిపోరా- శ్రీనగర్ హైవే వద్ద దొరికిన ఐఇడిని బాంబు నిర్మూలన దళం నిర్వీర్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో.

మరింత సమాచారం తెలుసుకోండి: