గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. 2 నెలల కాలంలో పెట్రోల్ ధర ఏకంగా ముప్పై సార్లు పెరిగింది. ఇక ఈ రేట్లు మళ్ళీ ఈరోజు కూడా పెరిగి పోయి టెన్షన్ పెడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర ఇటీవల 77 డాలర్ల పైకి చేరడంతో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పినట్టు జరుగుతోంది. 


ఇక ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.104.14గా నమోదయింది. డీజిల్ ధర కూడా 18 పైసలు పెరగడంతో డీజిల్ ధర లీటరుకు రూ.97.58  వరకు చేరింది. ఇక పెట్రోల్ సెంచరీ మార్క్ దాతగా ఇప్పుడు డీజిల్ కూడా ఆ మార్క్ దిశగా పరుగులు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: