దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు ప్ర‌తిరోజు పెరుగుతున్నాయి.అయితే ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ నిర‌స‌న‌ల‌కు పిలుపినిచ్చింది.ఇందులో భాగంగా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ఛ‌లో రాజ‌భ‌వ‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది.హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్క్ నుంచి రాజ్‌భ‌వ‌న్ వ‌ర‌కు భారీ ర్యాలీని నిర్వ‌హించి అనంత‌రం గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసి విన‌తిపత్రం ఇవ్వ‌నున్నారు.ఇందిరా పార్క్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు.అయితే ధ‌ర‌ల‌పెంపును నిర‌సిస్తూ నాంప‌ల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ ఇందిరాపార్క్ వ‌ర‌కు గుర్రం బండిపై వ‌చ్చారు.ధ‌ర‌ల పెర‌గ‌డంతో సామ‌న్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారంటూ ఆయ‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు.ఛ‌లో రాజ్‌భ‌వ‌న్ కార్య‌క్ర‌మానికి భారీగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. కాంగ్రెస్ నేత‌ల ఛ‌లో రాజ్‌భ‌వ‌న్ కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో ఇందిరాపార్క్‌,రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు. రాజ్‌భ‌వ‌న్ గేటుకు కాంగ్రెస్ జెండాలు క‌ట్టి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: