ఇక నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనేకమంది సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ లాంటి స్టార్ హీరోలు పవర్ స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన నటీ నటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. పవన్ తో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసి ఆయన్ని విష్ చేసింది.

పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సానుకూల మార్పులను తీసుకురావడానికి మీ ఆకర్షణ ఇంకా చిత్తశుద్ధి మిమ్మల్ని నిజంగా అందరికి స్ఫూర్తిగా చేస్తాయి. మీకు మంచి ఆరోగ్యం, విజయాలు అలాగే సంతోషం కలగాలని కోరుకుంటున్నాను.మీతో కలిసి పని చేయడం చాలా గొప్పగా ఉందంటూ ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నది.కీర్తి సురేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి సినిమాలో నటించింది.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి నటిస్తుంది.


https://m.facebook.com/story.php?story_fbid=394227168734780&id=100044424996585

మరింత సమాచారం తెలుసుకోండి: