కరోనా తొలిదశ కంటే ముందు నుంచే దుప్పట్లను పంపిణీ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కొద్ది రోజుల పాటు అందుబాటులో ఉంచింది. కానీ కరోనా కారణంగా బెడ్‌షీట్లు, దుప్పట్లు ఇవ్వడాన్ని నిరాకరించింది. ప్రస్తుతం శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో రైళ్లలో బెడ్‌రోల్ కు డిమాండ్ పెరుగుతున్నది. ప్రయాణికులకు మరల దుప్పటి, దిండు, బెడ్‌షీట్ అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నామని, అతిత్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఢిల్లీతో పాటు దేశంలో ఉన్న పలు రైల్వే విభాగాలు రైళ్లలో ఆన్ బోర్డు డిమాండ్ కింద డిస్పోజబుల్ ట్రావెల్ బెడ్‌రోల్ కిట్‌ను అందించనున్నట్టు సమాచారం. ఇందుకోసం రూ.300 వరకు చెల్లించాలి ప్రయాణికులు. కరోనా కారణంగా కొన్ని రైళ్లను నిలిపివేసిన విషయం విధితమే. కోవిడ్ 19 మహమ్మారి ఉధృతి కాస్త తగ్గిన తరువాతనే పలుమార్గాల్లో రైళ్లను ప్రారంభించారు. దీంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేశాఖ ప్రయాణం సులభతరం చేసింది.
మరింత సమాచారం తెలుసుకోండి: