దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం  కొన‌సాగుతోంది. ఈ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, హోంమంత్రి అమిత్ షాతో స‌హా ప‌లువురు హాజ‌రు అయ్యారు. ముఖ్యంగా ప్ర‌ధానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జే.పీ.న‌డ్డా  స‌మావేశంలో స్వాగ‌తం ప‌లికారు. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశ‌మును  ప్ర‌ధాని మోడీ, అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ప్రారంభించారు.

అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ప‌లు రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్లు వ‌ర్చువ‌ల్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల‌లో నిర్వ‌హించే అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రుణంలో పార్టీ ఏ విధంగా అనుస‌రించాల‌ని చ‌ర్చించ‌డంతో పాటు ప‌లు తీర్మాణాల‌ను ఆమోదించ‌డ‌మే ఈ స‌మావేశం ఎజెండా. జేపీ నడ్డా చేసిన  ప్రసంగంలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న పంజాబ్‌ను దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం సిక్కుల కోసం చేపట్టిన పలు చర్యల గురించి వివ‌రించారు. అదేవిధంగా బీజేపీ రాజ‌కీయ తీర్మాణాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌వేశ‌పెట్టారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: