ఆగ్రహంతో జయంతి పిల్లలు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకొని నిద్రించింది. అదే సమయంలో బంటు తన గ్రామంలోనే మరో ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. బంటూ వచ్చే సరికి ఎలాంటి స్పందన లేదు. కొద్ది సేపటికే అక్కడ ఇరుగు పొరుగు వారు గుమికూడారు. వారి సహాయంతో తలుపులు పగులగొట్టి చూసారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి చలించిపోయాడు. మృతుల్లో ఐదు నెలల వయస్సు ఉన్న కోమార్తె కోమల్‌తో పాటు రెండేళ్ల కుమారుడు బాలకిషన్ గొంతు కోసి హత్య చేసినది జయంతి. పక్కనే కూర్చొని ఏడుస్తూ కనిపించింది. పిల్లల మృతదేహాలను చూసి జనం కూడ చలించిపోయారు. సమాచారం తెలుసుకున్న భూటా పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భర్త బంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు జయంతిని అరెస్టు చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి