అయితే ఈ ఘటన తరువాత అక్కడి ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇదే తరుణంలోనే తాజాగా శ్రీకృష్ణనగర్లో మరో ఘటన చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకు ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 18 ఇండ్లకు పైగా అకస్మాత్తుగా బీటలు వారాయి. గోడలు, మెట్లపై భారీగా పగుళ్లు ఏర్పడినాయి. కృష్ణానగర్లో నివసించాలంటేనే భయంగా ఉందని, ఎక్కడ నుంచి ప్రమాదం పొంచి ఉందోనని తెలియక భయపడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా రాయలసీమలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రథమమని ప్రొఫెసర్ బృందం తెలియజేసినది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి