ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు ముఖ్యంగా తిరుప‌తిలో బీభ‌త్సం సృష్టించిన విషయం విధిత‌మే. తాజాగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇవాళ తిరుప‌తిలో ప‌ర్య‌టించి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించి వారికి త‌గిన ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వం క‌ల్పిస్తుంద‌ని, సురక్షిత ప్రాంతాల్లో వారికి స్థ‌లంలో ఇల్లు నిర్మించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తుంద‌ని హామీ కూడా ఇచ్చారు.

తాజాగా టీటీడీ చైర్మ‌న్ వైసీ సుబ్బారెడ్డి ఐఐటి నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో డిసెంబ‌ర్ నెల చివ‌రి వ‌ర‌కు అప్ ఘాట్ రోడ్డు అన‌గా రెండ‌వ ఘాట్ రోడ్డును పూర్తి చేయాల‌ని సూచించారు. శ‌నివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహ‌నాల‌ను పంపించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. అదేవిధంగా ప్రమాదకరంగా ఉన్నట్టు గుర్తించిన కొండ చరియలను కెమికల్ టెక్నాలజీని ఉపయోగించి ఇబ్బంది లేని విధంగా తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యంలో ఖ‌ర్చుకు ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని.. భ‌క్తుల భ‌ద్ర‌త‌నే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేసారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఉప‌ద్ర‌వాలు త‌లెత్త‌కుండా శాశ్వ‌త చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని  టీటీడీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: