ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య మృతి చెందార‌ని వార్త తెలుసుకుని చంద్ర‌బాబు ఉద‌యం తొలుత సంతాపం ప్ర‌క‌టించి మ‌ధ్యాహ్నం బ‌ల్కంపేట‌లో ఉన్న ఆయ‌న నివాసానికి చేరుకుని నివాళుల‌ర్పించారు. అనంత‌రం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. రోశ‌య్య‌తో క‌లిసి తాను కూడా ప‌ని చేసాన‌ని గుర్తు చేసారు. ఏ నాయకుడికి సాధ్యం కానీ 16 సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ముఖ్యంగా వ‌రుస‌గా 7 సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఆయ‌న అనేక సార్లు నేను చూసాన‌ని.. వినూత‌న రీతిలో స‌మ‌స్య‌ను ప్ర‌జ‌ల‌కు చేరవేసే వ్య‌క్తి అని పేర్కొన్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటే రోశ‌య్య‌తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆస్తి.. నిరంత‌రం పోరాటం యోధుడు.. ఎన్టీ రంగా నాయ‌క‌త్వంలో ఆయ‌న పొలిటిక‌ల్ క‌ళాశాల‌లో శిక్ష‌ణ పొంది ఉన్న‌త స్థానాన్ని ఏర్ప‌రుచుకొని అంచెలంచెలుగా ఎదిగారు.

1978లోనే రోశ‌య్య రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు.  రాజ‌కీయాల విలువ‌ల‌ను కాపాడిన వ్య‌క్తి రోశ‌య్య‌.. రాజ‌కీయంగా విభేదించినా వ్య‌క్తిగ‌తంగా ఎప్పుడు ఆప్యాయంగా ఉండేవారు. రోశ‌య్య అజాత శత్రువు అని.. న‌మ్మిన సిద్దాంతాన్ని పాటించేవారు. ఉద‌యం 5 గంట‌ల‌కే నిద్ర లేచి ప్ర‌తిరోజు మెట్ల‌పైనే కూర్చునే వార‌ని గుర్తు చేశారు చంద్ర‌బాబు. విసుగు చెంద‌కుండా ప‌ని చేసిన వ్య‌క్తి రోశ‌య్య‌. రాబోయే త‌రాలు రాజ‌కీయంగా ఆద‌ర్శంగా తీసుకుని.. వ్య‌క్తి గ‌తంగా కాకుండా రాజ‌కీయంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాల‌ని కోరారు. స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌డం.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకుచ్చారు రోశ‌య్య గుర్తు చేశారు. రోశ‌య్య ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. అదేవిధంగా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ‌మైన సానుభూతిని ప్ర‌క‌టించారు. రోశ‌య్య చ‌రిత్ర చాలా ఉంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: