వైసీపీ ఎంపీ విజయ సాయి
రెడ్డి గుంటూరులోనూ సక్సస్ అయ్యారు. ఇదేదో రాజకీయ అంశం కాదులెండి.. గుంటూరు జిల్లా ఆచార్య
నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన
జాబ్ మేళా విజయవంతం అయ్యింది.
జాబ్ మేళాలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా గణనీయంగానే ఉద్యోగాలు ఇప్పించారు. ఈ ఉద్యోగ మేళాలో 26 వేల ఉద్యోగాలు ఇస్తామని విజయసాయిరెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే అంత రాకపోయినా.. రెండు రోజులు కలిపి 10వేల 480 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు లభించేవరకు ఈ ఉద్యోగ మేళాలను కొనసాగిస్తామన్నారు. నాలుగో జాబ్ మేళా
కడప జిల్లా యోగివేమన విశ్వవిద్యాలయంలో
జూన్ మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు.
వైసీపీ ఓ రాజకీయ పార్టీయే అయినా.. ఇలాంటి రాజకీయేతర కార్యక్రమంలోనూ పాలు పంచుకోవడం మెచ్చుకోదగిన విషయం. ఎంత సేపూ రాజకీయాల రొచ్చులో పడి కొట్టుకోకుండా ఇలా యువతకు మేలు చేసే కార్యక్రమం చేయడం అభినందనీయం.