మే 16 సీఎం జగన్ రైతుల ఖాతాల్లో డబ్బులు వేయబోతున్నారు. మే 16 తేదీన రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. మే 16న తొలివిడతగా 5 వేల 500 రూపాయలు రైతుల ఖాతా‌ల్లో జగన్ వేయబోతున్నారు. అలాగే రెండో విడత కింద  మే 31 తేదీన ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇలా  రెండు దఫాలుగా 7500 రూపాయలను వేసేందుకు సీఎం నిర్ణయించారు. అలాగే జూన్ 19 తేదీన యానిమల్ ఆంబులెన్సు లను ప్రారంభించేందుకు  కేబినెట్ ఆమోదం తెలియ చేసింది. జూన్ 6 తేదీన  కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద 3 వేల  ట్రాక్టర్లు, 402 హార్వెస్టర్ల పంపిణీ చేస్తారు. జూన్ 1 తేదీన వ్యవసాయనికి సాగునీటి విడుదల ప్రణాళికను కూడా ఇవ్వబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: