ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిగా ఓ ఎస్టీ మహిళలకు అవకాశం కల్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకూ ఏ గిరజనుడు, గిరిజన మహిళ కానీ ఈ పదవి అందుకోలేదు. ప్రధాని మోదీ మొదటి సారి ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత రాజ్యాంగబద్ద పదవిలో కూర్చోబెడుతున్నారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ అనూహ్యంగా దళిత నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెరపైకి తీసుకొచ్చారు.

గతంలో ఎస్సీలకు రాష్ట్రపతి పదవి కట్టబెట్టిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఎస్టీలకు ఆ అవకాశం ఇవ్వడం ద్వారా బడుగుబలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకునే అవకాశం కలిగింది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా అవకాశం దక్కని గిరిజనులకు.. అందులోనూ గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి అవకాశం ఇవ్వడం నిజంగా అభినందనీయమే. రాష్ట్రపతిగా ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక్క మహిళ ప్రతిభా పాటిల్‌ పని చేశారు. ముర్ముకు ఇప్పుడు రెండో మహిళగా అవకాశం దక్కింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: