భారత్‌, చైనా సరిహద్దుల్లో ఇప్పుడు శాంతి కనిపిస్తోంది. తూర్పు లద్దాఖ్ లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ వద్ద పరిస్థితులు చక్కబడుతున్నాయి. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న పెట్రోలింగ్  పాయింట్ -15 నుంచి భారత్ , చైనా బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మౌలిక వసతులను తొలగించాయి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారమే రెండు పక్షాలూ ఈ ప్రక్రియను చేపట్టాయి.

పీపీ-15 నుంచి రెండు దేశాల సైనికుల ఉపసంహరణ జరిగింది. దెమ్ చోక్ , దెప్సాంగ్  ప్రాంతాల్లో వివాదాలను పరిష్కరించుకునే అంశంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. 2020 జూన్ లో జరిగిన గల్వాన్  ఘటన తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ తర్వాత భారత్ -చైనా సైనికాధికారులు పలు దఫాలు చర్చలు జరిపారు. 16వ విడతలో భాగంగా మేజర్  జనరల్  స్థాయిలో చర్చలు జరిగాయి. ఫలితంగా పాంగాంగ్  సరస్సు, గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17 చర్చల ఫలితంగా ఇప్పుడు గోగ్రా-హాట్ స్ప్రింగ్స్  నుంచి బలగాలు వైదొలిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: