తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం తాజాగా జరిగింది. వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో తాజాగా నియమించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో రేడియోగ్రఫర్స్ పోస్టుల భర్తీ కోసం 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆ తర్వాత అర్హులైన అభ్యర్థులతో కూడిన ఎంపిక జాబితా విడుదల చేసింది. అయితే పోస్టుల్లో తమకు వెయిటేజి కావాలని కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు న్యాయస్థానం ఆశ్రయించారు. దీంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆలస్యం కావడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రక్రియను త్వరగా పూర్తియ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు తెలిపింది. తాజాగా ఆ కేసు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రేడియోగ్రాఫర్స్‌ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: