జనసేన అధినేత పవన్ వారాహి తో ప్రచారం సినిమా షూటింగ్ లా చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దింపడడమే నా లక్ష్యమని పవన్ అంటున్నారని.. ఆయన చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి  విమర్శించారు. ఖచ్చితంగా విధాన పరమైన నిర్ణయాలేవీ పవన్ తీసుకోలేదని.. సినిమాల్లో షూటింగ్ తరహాలోనే పవన్ మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు.


ఖచ్చితమైన ఆలోచనలో పవన్ మాట్లాడటం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి .. పవన్  మాట్లాడే మాటలు  పగటి కలలు, సినిమా డైలాగుల్లా ఉన్నాయన్నారు. జనసేనకు సంస్థాగతమైన నిర్మాణం, సింబల్ కూడా లేదని ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన వివరాల్లో ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు. జనసేన కు గుర్తు కూడా లేదని గాజు గ్లాసు ఎవరు తీసుకోకపోతే ఇస్తారేమో తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యమని పవన్ అంటున్నారని.. తద్వారా తను నమ్ముకున్న వారిని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: