ఇవాళ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లిస్తారు. ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు మళ్లిస్తారు.

సుజాత స్కూల్‌ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లిస్తారు.నగరవాసులు ఎల్బీ స్టేడియానికి వచ్చే దారుల్లో కాకుండా ప్రత్యామ్నయ దారులు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్డీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ కూడళ్ల వద్ద వాహనాలు బారులు తీరే అవకాశం ఉంది. ఏదైనా అసౌకర్యం ఏర్పడితే 910203626 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: