తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అష్టకష్టాలు పడి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలిగారు. పదేళ్ల పాటు ప్రతిపక్ష స్థానంలో ఉన్న హస్తం పార్టీ.. మెజార్టీ స్థానాల్లో గెలుపొంది కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని అధిష్ఠానం సీఎంగా ప్రకటించింది.


కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ఒకే వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. కానీ లోక్ సభ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం.. రేవంత్ నేతృత్వంలో అధికారంలోకి రావడంతో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఆయన్నే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇప్పుడు పోలింగ్ ముగిసింది. అందరూ జూన్ 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా పీసీసీ పదవి కోసం పైరవీలు ప్రారంభం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: