భారత మార్కెట్లో రోజురోజుకు మొబైల్ కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణంలో, దిగ్గజ మొబైల్ తయారీ సంస్థలు కూడా రకరకాల ఫీచర్లతో, టెక్నాలజీ లతో మొబైల్ ను తయారు చేసి ,మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం కూడా భారత మార్కెట్లో మోటోరోలా రూపొందించిన మోటోరోలా ఎడ్జ్ 20, మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ వంటి స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే మొదటి సేల్ అయిపోయిన తరువాత చాలా రోజుల వరకు ఈ స్మార్ట్ ఫోన్ లు భారత మార్కెట్లో అందుబాటులో లేవు. అయితే దాదాపు కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు సరికొత్తగా మోటోరోలా సేల్ మొదలైంది.. ఇక వీటి ధరలు , స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..


మోటోరోలా  ఎడ్జ్ 20 ఫ్యూజన్
స్మార్ట్ ఫోన్ సేల్ ఫ్లిప్కార్ట్ లో మొదలైంది. ఇది 6 జి బి ర్యామ్ తో పాటు 128gb వేరియంట్ తో మనకు లభిస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్ లో దీని ద్వారా రూ.21,999.. ఇక 8 జీబీ ర్యామ్, అలాగే 128 జీబీ వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫ్లిప్కార్ట్ లో రూ .22,999 కు మనకు లభిస్తుంది.

ఇక ఫీచర్స్ విషయాన్ని వేస్తే, మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో  90Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.7 ఇంచేస్  ఫుల్ హెచ్‌డీ అలాగే  ఓలెడ్ మ్యాక్స్ విజన్ డిస్‌ప్లే కూడా కలదు. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ 5జీ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే..108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోపాటు 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ లెన్స్ అలాగే  2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ తో కలిపి 3  కెమెరాల సెటప్ అమర్చబడింది.ఇక 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చారు.5G నెట్వర్క్ తో పనిచేస్తుంది.wifi 6 కనెక్టివిటీ కూడా కలదు.


మరింత సమాచారం తెలుసుకోండి: