ఇక మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గట్టి షాక్ ఇచ్చింది.వడ్డీ రేట్లను చాలా భారీగా పెంచింది. రెపో రేట్ అనేది ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో వడ్డీ రేటు కూడా 5.40 శాతానికి పెరిగింది. గత మూడు రోజులుగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచుతారని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేశాయి. ఈసారి రెపో రేట్ అనేది 35 బేసిస్ పాయింట్స్ పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తే ఆర్‌బీఐ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటుని పెంచింది. 100 బేసిస్ పాయింట్స్ అనేవి ఒక శాతం లేదా ఒక రూపాయితో సమానం. అంటే ఇప్పుడు 50 పైసలు వడ్డీ రేటు అనేది పెరిగింది.ఆర్‍బీఐ ఈ ఏడాది రెండుసార్లు కూడా రెపో రేట్ పెంచింది. మే 4 వ తేదీన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆకస్మికంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక ఆ తర్వాత జూన్ 8న మరోసారి ఆర్‌బీఐ రెపో రేట్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 8 వ తేదీన ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడం జరిగింది.అలాగే ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. అంటే మొత్తం 140 బేసిస్ పాయింట్స్ వడ్డీ అనేది పెరిగింది. అంటే మొత్తం 1.40 శాతం వడ్డీ పెరిగింది.ఇక కరోనా వైరస్ మహమ్మారి, దేశంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్‌బీఐ దశలవారీగా మొత్తం 250 బేసిస్ పాయింట్స్ అంటే 2.50 శాతం వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.


ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు వడ్డీ రేట్లు పెంచుతోంది ఆర్‌బీఐ.ఇక ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. ఇప్పుడు రెపో రేట్ అనేది 5.40 శాతానికి చేరుకుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు కూడా పెంచుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ అనేది భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఇంకా అలాగే ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు అనేది వర్తిస్తుంది. దాని ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి.ముఖ్యంగా హోమ్ లోన్లు అనేవి ఆర్‌బీఐ రెపో రేట్‌కు లింక్ అయి ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన కూడా ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ని కూడా ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ కనుక తగ్గితే ఈ వడ్డీ కూడా తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI