అమాయకుల ను టార్గెట్ గా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యం గా ఇటీవలి కాలం లో నిరుద్యోగులనే టార్గెట్ గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగు లకు పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ కల్పిస్తున్నారు. కొంత మంది కేటుగాళ్లు ఇలా నిరుద్యోగుల నుంచి పూర్తి వివరాలు సేకరించి ఖాతాలు ఖాళీ చేస్తూ ఉన్నారు. మరి కొంత మంది మోసగాళ్లు ఇక ఉద్యోగం పేరు తో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి చివరికి ప్లేట్ ఫిరా యిస్తున్నారు .
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఓ యువతిని ఉద్యోగం పేరుతో మాయ మాటల తో నమ్మించారు కేటుగాళ్ళు. ఇక ఆ యువతి దగ్గర నుంచి ఏకం గా లక్షన్నర వరకు కాజేశారు. ఫలక్నుమా కు చెందిన బీటెక్ విద్యార్థిని సోనాలి కి జాబ్ పేరుతో ఫోన్ చేసారు. Tcs లో ఉద్యోగం కన్ఫామ్ అయ్యింది అంటూ నమ్మ బలికారు. ఇక ముందుగా లక్షన్నర సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే అపాయింట్మెంట్ లెటర్ వస్తుందని నమ్మించి.. చివరకి డబ్బు పంపించ గానే ప్లేట్ ఫిరాయించారు. దీంతో మోస పోయాను అని గ్రహించిన బాధిత యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.