ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి మనిషి జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది. కావలసిన వస్తువులు కొనేందుకు ఎక్కడికో వెళ్ళడం కాదు అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో ఒక క్లిక్ ఇస్తే చాలు ఇంటి ముంగిటికే అన్ని వచ్చి వాలిపోతున్నాయి. దీంతో పెరిగిపోయిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఒకప్పటితో పోల్చి చూస్తే సామాన్యుడు సైతం లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఎందుకంటే ఇక టెక్నాలజీ పెరిగిపోయి ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏకంగా కోటీశ్వరుడు లాగానే ఇంట్లో కూర్చుని అన్ని దగ్గరికి తెప్పించుకోగలుగుతున్నాడు సామాన్యుడు.



 ఇలా మనిషి జీవితం టెక్నాలజీతో ఎంతో విలాసవంతంగా మారింది. కానీ అదే సమయంలో పెరిగిపోయిన టెక్నాలజీ అటు అనుకోని సమస్యలను తెచ్చిపెడుతుంది అన్నది మాత్రం వెలుగులోకి వస్తున్న ఘటనలను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని గద్దల్ల కాచుకుని వేచి చూస్తున్న సైబర్ నేరగాలు ఎవరైనా చిన్న తప్పు చేశారు అంటే చాలు దాన్ని క్యాష్ చేసుకొని ఖాతా మొత్తం ఖాళీ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  ఇటీవల కాలంలో సెటప్ బాక్స్ కి రీఛార్జ్ చేయడం అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు.



 కానీ ఇలా సెట్ టాప్ బాక్స్ రీఛార్జ్ చేయడమే ఇక్కడ ఒక మహిళకు శాపంగా మారిపోయింది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని చివరికి భారీగా డబ్బులు పోగొట్టుకుంది. ముంబైకి చెందిన 47 ఏళ్ల మహిళా సెటప్ బాక్స్ కు 931 రూపాయలు రీఛార్జ్ చేసిన చానల్స్ రాకపోవడంతో గూగుల్ లో కనిపించిన కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేసింది. ఆ రోజు కాల్ కలవలేదు. కానీ మర్నాడు ఒక వ్యక్తి కాల్ చేసి కస్టమర్ కేర్ అంటూ ఆమె మొబైల్ లో రిమోట్ యాక్సిస్ కంట్రోల్ యాప్ ని డౌన్లోడ్ చేయించి ఇక చివరికి ఆమె ఖాతా నుంచి 81 వేల రూపాయలు కాజేసాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: