కావాల్సిన ప‌దార్థాలు:
అరటి పువ్వు- ఒక‌టి
ఉల్లి పాయ- ఒక‌టి
ఆవాలు- అర టీ స్పూన్‌
శనగపప్పు- ఒక‌ టీ స్పూన్‌

 

మినప్పప్పు- ఒక‌ టీ స్పూన్‌
నిమ్మ‌కాయ‌- ఒక‌టి
నూనె- మూడు టీ స్పూన్‌
వెల్లుల్లి- మూడు రెబ్బ‌లు
ఉప్పు- రుచికి సరిపడ

 

పసుపు- అర‌ టీ స్పూను
మిరియాల పొడి- పావు టీ స్పూన్‌
జీరాపొడి- పావు టీ స్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బ‌లు
కొత్తిమీర‌- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా చేయాల్సిందేంటంటే.. చేతులకు కొద్దిగా నూనె అప్లై చేసుకుని అరటి పువ్వు కాడలు తీసివేయాలి. తర్వాత ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని నిమ్మరసం క‌ల‌పాలి. ఆ నీటిలో అరటి పువ్వును బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు‌ పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, పప్పులు వేసి వేగాక ఉల్లిపాయ, వెల్లుల్లి తరుగు వేసి వేగిన తర్వాత అరటి పువ్వు తరుగు వేయాలి. 

 

అన్నీ ఒకసారి కలిపి పసుపు, జీరాపొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి ప‌ది నిమిషాలు ముతపెట్టి వేగించాలి. పువ్వు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంటే ఎంతో సులువైన రుచిక‌ర‌మైన అరటిపువ్వు ఫ్రై రెడీ. మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: