
మనం ఇంతో ఎన్నో రకాల పులిహోరలు చేసుకుంటుంటాం.. మామిడి పులిహోర, టమోటా పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇలా ఎన్నో రకాల పులిహోరలను మనం తింటుంటాం. అయితే ఇప్పుడు టమోటా పులిహోర ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లోనే ఈ పులిహోర చేసుకొని తినేయండి.
కావాల్సిన పదార్దాలు..
బియ్యం - పావుకిలో,
టొమాటోలు - పావుకిలో,
చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను,
పచ్చిమిర్చి - ఆరు,
ఇంగువ - చిటికెడు,
వేరుసెనగ పప్పు - 3 టేబుల్ స్పూన్లు,
సెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు,
మినప్పప్పు - 2 టేబుల్‌స్పూన్లు,
ఉప్పు - తగినంత,
ఎండుమిర్చి - నాలుగు,
ఆవాలు - టీస్పూను,
నూనె - 100 మి.లీ.,
కరివేపాకు - నాలుగు రెబ్బలు,
పసుపు - టీస్పూను
తయారీ విధానం..
టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి ఉడికించాలి. చల్లారాక చింతపండు గుజ్జు చేర్చి పేస్ట్ లా తయారు చెయ్యాలి. అన్నం ఉడికించి పక్కన ఉంచాలి. వెడల్పాటి బాణలిలో ఉడికించిన అన్నంలో టొమాటో గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. పాన్ లో నూనె పోసి వేరుసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి. ఆతరవాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును టొమాటో గుజ్జు కలిపి అన్నంలో వేసి కలపాలి. అంతే టమోటా పులిహోర రెడీ అవుతుంది.