ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. అది ఏంటంటే  పుల్ల పుల్లని కారం కారంగా ఉండే "గోంగూర పనీర్” రెసిపీ. ఈ కర్రీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. గోంగూరకి ఉన్న టేస్ట్ మరే కూరకి ఉండదు. అందుకే గోంగూరకి ఆంధ్రమాత అనే బిరుదు కూడా ఉంది తెలుసు కదా. అలాగే గోంగూరలో పన్నీర్ వేయడం వల్ల కూర రుచి ఇంకా బాగుంటుంది. మరి గోంగూర పన్నీర్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా. !

కావాల్సిన పదార్ధాలు:

200 gms పనీర్
లేత గోంగూర - ఓ పెద్ద కట్ట
3 చీలికలు పచ్చిమిర్చి
1/2 cup టమాటో పేస్టు
1 ఉల్లిపాయ సన్నని తరుగు
1 tsp అల్లం వెల్లులి పేస్ట్
1 tsp గరం మసాలా పొడి
1 tsp ధనియాల పొడి
2 tsps కారం
1/2 tsp పసుపు
సాల్ట్
1 tsp వేయించిన జీలకర్ర పొడి
1/4 cup నూనె
1 tsp ఆవాలు
1 tsp జీలకర్ర
2 ఎండు మిర్చి
200 ml నీళ్ళు

తయారీ విధానం:

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపటమనిపించండి.తరువాత ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి వేపాలి ఉల్లిపాయలు బంగారు రంగులోకి రావాలి. ఎర్రగా వేగాక అల్లం వెల్లులి పేస్టు వేసి వేపి ధనియాల పొడి, పసుపు , కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సాల్ట్ వేసి వేపుకోండి.తరువాత గోంగూర ఆకు తరుగు వేసి ఆకు మెత్తగా మగ్గేదాక మూత పెట్టి మగ్గించుకోవాలి. గోంగూర నూనెలో వేగితేనే జిగురు పోతుంది.గోంగూర మగ్గిన తరువాత అందులో  టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోండి. ఇప్పుడు నీళ్ళు పోసి పచ్చిమిర్చి చీలికలు వేసి కూర దగ్గరపడే దాకా హై-ఫ్లేం మీద ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచిన పనీర్ ముక్కలను కూరలో వేసి తక్కువ మంట మీద 5 నిమిషాలు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే గోంగూర పన్నీర్ కూర రెడీ అయిపోయినట్లే.. ఈ కూర అన్నంలోకి అలాగే చపాతీలోకి అయినాగానీ చాలా బాగుంటుంది.. !

మరింత సమాచారం తెలుసుకోండి: