ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఉపాధిని కోల్పోయారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఇక ఈ పరిస్థితులను అధిగమించాలని చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బాహ్య ప్రపంచం తో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం ఆన్ లైన్ లో జనాలను మోసం చేసేందుకు రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో అందాలను ఎరగా వేసి లక్షలు దండుకుంటున్నారు. ఇలాంటి మోసాలు లాక్ డౌన్ లో ఎక్కువగా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే.


మన దేశంలో ఓ రాష్ట్రంలోని మహిళల ను, యువతులను వారి ఇంట్లో వాళ్ళే ఇలా చేయాలనీ ప్రోత్సహిస్తున్నారట.. ఆ రాష్ట్రం లోని దాదాపు అన్నీ గ్రామాల్లోని వాళ్ళు అమాయకపు  ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. వివరాల్లోకి  వెళితే.. రాజస్థాన్ లో కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఆన్ లైన్ ఆధారంగా జనాలను మోసం చేస్తూ దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఈ రాష్ట్రం లోని భరత్ పూర్, హింగోటా, గంగ్ పురి లతో పాటుగా మరో 20 గ్రామాల్లోని యువతులు, గృహిణిలు లతో తమ కుటుంబ సభ్యులు కలిసి పెట్టుబడి లేని వ్యాపారాలను చేస్తున్నారు.


సోషల్ మీడియా లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టి, పరిచయాలను పెంచుకుంటారు. కొంతకాలం మంచిగా ఉంటూనే అసలు రంగును బయటపెడుతున్నారు. మొదట నైస్ గా మాట్లాడి ముగ్గులోకి దింపుతారు. వారి చేత నగ్న వీడియోలు, కాల్స్ మాట్లాడిస్తారు. తర్వాత వీటిని ఆధారంగా చేసుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే తమ అందాలని సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు దిగుతారు. ఇక చేసేదేమి లేక లక్షలను పోగొట్టుకున్నారు. ఇలా మోసపోయినట్లు సమీప ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ లో 72 కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు కూడా ఆ గ్రామాల్లోకి అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు.ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: