ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది నవవధువు. కానీ మూడు నెలలకే చివరికి ఆత్మహత్య చేసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఇక ఈ ఘటనలో మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. పుదుక్కొట్టై జిల్లా తిరుమయం సమీప గ్రామానికి చెందిన పుష్పరాజ్ కు దీప అనే 25 ఏళ్ల యువతితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తమ కూతురు ఎంతో ఆనందంగా ఉంది అని తల్లిదండ్రులు భావించారు.
కానీ ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది సదరు నవవధువు. ఈ క్రమంలోనే దీప తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన వేలు స్వామి అనే 35 ఏళ్ల వ్యక్తి తో వివాహానికి ముందే ఆ యువతి పరిచయమైంది. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. కాగా పెళ్లి చూపులకు ఎవరు వచ్చినా తాను వివాహం చేసుకోనని తల్లిదండ్రులకు దీప చెబుతూ ఉండేది. కానీ బంధువులు మాత్రం బలవంతంగా ఒప్పించి వివాహం చేశారు ఈ క్రమంలోనే మనోవేదనతో చివరకు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి