
ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో కూడా ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఇక కోటి ఆశలతో వధూవరులు ఇద్దరు కూడా దాంపత్య బంధంలోకి అడుగు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఒక అందమైన భార్య దొరికింది అంటే చాలు యువకుడి ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఇక్కడ ఓ యువకుడు కోరుకున్న భాగస్వామి దొరికినందుకు ఎంతగానో సంతోషంలో మునిగిపోయాడు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు. కానీ అతని సంతోషం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది.
పెళ్లయిన ఏడు రోజులకే వరుడు అతని కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యే ఘటన ఒకటి జరిగింది. పెళ్లయిన తర్వాత హనీమూన్ రోజున వధూత భర్తను తన వద్దకు రాకుండా అడ్డుకుంది. అప్పుడు భార్య ఏదో కారణం చేపి భర్తను దూరంగా ఉంచింది. పెళ్లయిన ఏడు రోజుల తర్వాత భార్య అకస్మాత్తుగా ఇంట్లో కనిపించలేదు. ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే ఇంట్లో ఉన్న బంగారం వెండి ఆభరణాలు మూడు లక్షల నగదు కనిపించలేదు. దీంతో విషయం వారికి అర్థమైంది. వెంటనే మ్యారేజ్ సెట్ చేసిన బ్రోకర్ వద్దకు వెళ్తే ఇక వధువు అతనితో రాసలీలల్లో మునిగి తేలుతూ ఉండడం కనిపించింది. దీంతో ఇక వీరందరూ దోచుకునే ముఠా అని తెలుసుకున్న వారు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.