
అయితే ఇలా బురిడీ బాబాల ముసుగులో కొంతమంది ఏకంగా జనాల నమ్మకాలను క్యాష్ చేసుకొని ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో నగ్నంగా పూజలు చేయడమే కాదు మహిళలపై అత్యాచారం చేసిన ఘటన మరవకముందే ఇక ఇప్పుడు ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని రేణిగుంటలో ఇలాంటి ఘటనే జరిగిందే. ఏకంగా మహిళకు చేతబడి జరిగిందని దాన్ని వదిలిస్తాను అంటూ సుబ్బయ్య అనే బురిడీ బాబా నమ్మించాడు.
ఈ క్రమంలోనే ఇంట్లో చాలా పూజలు చేయాలి అంటూ కుటుంబ సభ్యులందరినీ కూడా నమ్మించాడు సదరు వ్యక్తి. అయితే చేతబడి కోసం పూజ చేసేందుకు ఇక మహిళ ఇంటికి వెళ్లిన సుబ్బయ్య పూజలో బట్టలు లేకుండా నగ్నంగా కూర్చోవాలి అంటూ చెప్పాడు. ఇందుకు ఆ మహిళ నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే మహిళ సుబ్బయ్య చెప్పిన మాట ఎంతకీ వినకపోవడంతో గోర్లతో మహిళ వీపుపై రక్కాడు. చాకుతో పొడవ పోయాడు. అయితే ఆమె కేకులు వేయడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక ఇలా పూజలు పేరుతో దారుణానికి పాల్పడిన సుబ్బయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.