కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో చూసిన ఘటనలు అటు నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సినిమాల్లో నేరస్తులు చేసిన పనులు చూసి ప్రభావితం అయిన వారు ఇక నిజ జీవితంలో కూడా ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో గంధపు చెక్కలను స్మగ్లిన్ చేయడానికి ఇక పోలీసుల నుంచి తపించుకునేందుకు వేసిన ఐడియాలు నిజ జీవితంలో కూడా ఎంతో మంది స్మగ్లర్లు ఫాలో అయ్యారు. అయితే అక్రమార్కులే కాదు పోలీసులు కూడా పుష్ప సినిమా చూసే ఉంటారు. దీంతో అక్రమార్కుల ఆటలు సాగలేదు.


 అయితే అక్రమార్కులు మాత్రమే కాదండోయ్.. కొన్ని కొన్ని సార్లు పోలీసులు కూడా వింతైన పనులు చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కాగా ఇటీవల  కాలంలో దేశంలో గంజాయి స్మగ్లింగ్ ఎంతల పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోలీసుల కళ్ళు గప్పి వినూత్న రీతిలో స్మగ్లింగ్ చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారి ఆటలకు అడ్డుకట్ట వేస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ పోలీసులు కూడా ఇలాగే భారీగా గంజాయి పట్టుకున్నారు.


 గంజాయి అయితే పట్టుకున్నారు కానీ వాటి వివరాలను కోర్టులో హాజరుపరచలేదు. ఏమైంది అని అడిగితే ఎలుకలు గంజాయి తినేసాయి అంటూ వింత సమాధానం చెప్పారు. ఇలా మద్రాస్ కోర్టుకు పోలీసులు వింత సమాధానం చెప్పారు. 2020లో మెరీనా బీచ్ లో కొందరు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో నిందితులను తాజాగా కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ సందర్భంగా గంజాయి ఎక్కడుందని పోలీసులను జడ్జి ప్రశ్నించారు. అయితే ఎలుకలు తిన్నాయని పోలీసులు సమాధానం చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ఈ విషయంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆధారాలు చూపాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: