పరాయి వాళ్ళు సొంతవాళ్లు అనే తేడా లేదు. క్షణికావేషంలో విచక్షణ కోల్పోతూ చివరికి ప్రాణాలను తీసేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని తెలియక భయం భయంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు గడుపుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవులోకి చెందినదే. సాదరణంగా మన సమస్యల గురించి మన కంటే ఎక్కువ ఇరుగుపొరుగు వారికి పట్టింపు ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇదే జరిగింది. వారికి పెళ్లయి ఏళ్ళు గడిచాయి. కానీ ఇప్పటివరకు పిల్లలు కాలేదు.
ఇలాంటి సమయంలో ఇరుగుపొరుగు వాళ్ళు పిల్లలు ఎందుకు కాలేదు అని అడగడం సహజం. ఏదైనా డాక్టర్ కు చూపించుకుంటే బాగుంటుంది కదా అని ఉచిత సలహాలు ఇస్తారు. ఇక్కడ పొరుగింటి వారు ఇలాగే సలహాలు ఇవ్వడంతో కోపంతో ఊగిపోయిన సదరు వ్యక్తి దారుణంగా సుత్తితో కొట్టి చంపాడు. ఈ ఘటన పంజాబ్ లోని లూథియానాలో వెలుగులోకి వచ్చింది. మున్నా అనే వ్యక్తికి పెళ్ళై ఏళ్ళు గడుస్తున్న పిల్లలు పుట్టలేదు. పక్కింట్లో ఉండే సురేందర్ కౌర్ పిల్లని ఎప్పుడు కంటారు వైద్యులకు చూపించుకో అంటూ మున్నాను విసిగిస్తూ ఉండేది. అయితే ఇటీవల తన భార్య ముందే మరోసారి అలా అనడంతో ఆమెతో పాటు భర్త చమన్ లాల్ అత్త మున్నా కౌర్ కూడా సుత్తితో కొట్టి చంపేశాడు సదరు వ్యక్తి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి