నేటి సభ్య సమాజంలో అసలు మనిషి ప్రాణాలకు విలువే లేదా అంటే వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత అందరూ అవును అనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది. ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనిషి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఇక ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అనే భయం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఏ క్షణంలో ఎవరు దాడి చేస్తారు అని అనుక్షణం భయపడుతూనే బ్రతుకుతున్నారు ఎంతోమంది.


 ఇటీవల ఉత్తర ప్రదేశ్ లోని షాజాహాన్పూర్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడాదిన్నర వయస్సు ఉన్న కూతురిని భుజలపై మోసుకుని వెళ్తున్న ఒక వ్యక్తిపై దుండగుడు అతి సమీపం నుంచి గన్ తో కాల్పులు జరిపాడు. దీంతో సదర్ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బబు జాయ్ ప్రాంతానికి చెందిన షోయబ్ రాత్రి సమయంలో తన కూతురిని భుజాలపై మోస్తూ ఇంటికి వెళ్తున్నాడు. అయితే బైక్ పై ముగ్గురు దుండగులు అతడిని ఎదురుగా వచ్చారు. ఇద్దరు వ్యక్తులు మరో బైక్ పై రాగా షోయబ్ కు ఎదురుగా ఇంకో వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. ఇక టీషర్ట్ లో దాచిపెట్టుకున్న గన్ను బయటకు తీసి షోయబ్ పాయింట్ బ్లాంక్  లో కాల్పులు జరిపాడు. అంతే షోయబ్ రెప్పపాటు కాలంలో కుప్పకూలిపోయాడు.


 ఇలా కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు బైక్ పై పరారయ్యాడు. షోయబ్ వెనకే వస్తున్న అతడి కుటుంబ సభ్యులు ఇది చూసి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. కళ్ళముందే దుండగులు షోయబ్ పై కాల్పులు జరపడాన్ని  చూసి భయాందోళనకు గురి అయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ షోయబ్ ని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది అనేది తెలుస్తోంది. అయితే షోయబ్ కూతురు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడింది. అయితే షోయబ్ పై అతి సమీపం నుండి గన్ ఫైరింగ్ చేయడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: