సాధారణంగా సముద్రంలో ఎవరు కని విని ఎరగని వింత జీవులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది అడ్వెంచర్స్ చేసే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వారి కెమెరాలకు ఇలాంటి వింతైన జీవులు చిక్కడం చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటివి చూసి వాటిని ఏం పేరు పెట్టి పిలవాలో కూడా తెలియక అందరూ అయోమయంలో పడిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వింత జీవులు అప్పుడప్పుడు అలల తాకిడి ఎక్కువైతే ఇక తీరంలోకి కొట్టుకు రావడం కూడా జరుగుతూ ఉంటుంది.


 ఇలా తీరంలోకి వింత జీవులు కొట్టుకు వచ్చాయి అన్న వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలా కొన్ని జీవులు చూసేందుకు అందంగా ఉన్నప్పటికీ అవి ఎంతో ప్రమాదకరం అని నిపుణులు చెబుతూ ఉంటారు  వాటికి దగ్గరగా అసలు వెళ్ళకూడదు అని హెచ్చరిస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి వైరల్ గా మారిపోయింది. విశాఖ తీరంలో వింత జీవులు దర్శనమిచ్చాయి. ఆ జీవులు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయ్. దీంతో తీరంలో ఉన్న జనాలు ఆ జీవులను చూస్తూ అలాగే ఉండిపోయారు.


 కాగా ఈ వింత జీవులకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని అస్సలు తాకవద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ రెండు వింత జీవుల పేర్లు బ్లూ సీ బటన్,  బ్లూ సీ డ్రాగన్. ది బ్లూ సీ డ్రాగన్ ను సముద్రపు బల్లులు అని అంటారట. ఇది కుడితే తీవ్రమైన నొప్పి ఉంటుందట. ఇక బ్లూ సి బటన్ శాస్త్రీయ నామం ఫోర్పిటా. ఇది ఒక జీవి కాదు హైడ్రోయిడ్స్ అని పిలవబడే అనేక చిన్న జీవుల కాలనీ. ఇవి తరచుగా విశాఖ ఆర్కే బీచ్ లో కనిపిస్తాయి. అయితే వాటిని ప్రజలు తాకవద్దని నిపుణులు  హెచ్చరిస్తూ ఉంటారు. వాటిని తాకితే వికారం నొప్పి వాంతులు చర్మ సంబంధిత సమస్యలు సహా మరిన్ని వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: