కేంద్రం మావోయిస్టులను లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఎన్కౌంటర్లతో దండకారణ్యాన్ని భద్రతా బలగాలు వణికిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు పిలుపునిచ్చినప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కితగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 28 మంది మావోలు మరణించారు. ఇదే ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావు సైతం కన్నుమూశారు . 

ఆయనపై ఏకంగా కోటి రివార్డు ఉండగా బలగాలు ఆయనను అంతం చేశాయి . భారతదేశ మావోయిస్టు ఉద్యమంలో కేశవరావు  పాత్ర ముఖ్యమైనది. ప్రస్తుతం ఆయన party OF INDIA' target='_blank' title='కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేశవరావు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జన్మించాడు. బీటెక్ చదివిన నంబాల 1970 లోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. 1980 లో మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోశించే స్థాయికి ఎదిగారు. గెరిల్లా యుద్ధ విన్యాసాలు, పేలుబు పధార్థాల వినియోగంలో ఆయన నిపుణుడు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్ టీటీఈ మాజీ యోధుల వద్ద నంబాల కేశవరావు శిక్షణ తీసుకున్నారు .

నంబాల అనేక మావోయిస్టు దాడుల్లో ముఖ్య భూమిక పోశించారు. 2010 లో దంతెవాడలో 70 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు హతమైన దాడి వెనక ఆయనే ఉన్నారు. అంతే కాకుండా 2013 లో జీరాంఘాటీలో 27 మంది, ఇందులో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నాయకుడు నందకుమార్ పటేల్ హతమయ్యారు. అంతే కాకుండా సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడికి కూడా ప్రధాన సూత్రదారిగా కేశవరావు ఉన్నారు. ఇలా అనే దాడుల్లో కేశవరావు పాత్ర ఉంది. చాలా ఏళ్లుగా కేశవరావు హిట్ లిస్టులో ఉన్నారు. ఇక తాజాగా ఆయన మరణించడంతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: