గంటా శ్రీనివాసరావు.. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు..? ఇదేం ప్రశ్న ఆయన తెలుగు దేశంలోనే ఉన్నారు కదా అంటారా.. అవును.. కానీ.. ఆయన ఎప్పటికప్పుడు పార్టీ మారుతున్నారని వార్తలు వస్తూనే ఉంటాయి.. ఆయన ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉంటారు.. పాపం.. ఆయన ఖండించి ఖండించి ఊరుకున్నారు.. కానీ ఈ పార్టీ మారుతున్నారన్న వార్తలు మాత్రం ఆగనేలేదు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు ఇవాళ 12 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారు.


అయితే.. ఇవాళ చంద్రబాబు నిర్వహిస్తున్న నియోజకవర్గాల్లో విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయి.. ఆయా జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. మొత్తం 3 జిల్లాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో చంద్రబాబు భేటీ అవుతున్నారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఈ సమావేశo జరుగుతోంది. అయితే.. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. తాను ఈ సమావేశానికి హాజరుకావడం లేదని పార్టీకి గంటా శ్రీనివాసరావు ముందుగానే పార్టీ అధినేతకు సమాచారం అందించారట.


త్వరలో తాను స్వయంగా వచ్చిన చంద్రబాబును కలుస్తానని.. ఇప్పుడు మాత్రం రాలేనని చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు సమాచారం ఇచ్చారట. ఇలా గంటా శ్రీనివాసరావు తాను మీటింగ్‌కు ముందే రాలేనని చెప్పడం టీడీపీలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. పార్టీ సమావేశం ముందుగానే నిర్ణయించింది.. ముందుగా సమాచారం ఇచ్చినా.. మిగిలిన నాయకులు వస్తున్నా.. అంతగా హాజరుకాలేని పరిస్థితులు ఏముంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీని గంటా లైట్‌ గా తీసుకోడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని గంటా విమర్శకులు అంటున్నారు.


గంటా శ్రీనివాసరావు అసలు ఇటీవల వార్తల్లో ఉండటం లేదు. పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. కానీ అధికారం ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు గంటాకు మంచి స్థానమే ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చి మరీ ప్రోత్సహించారు. కానీ అధికారంలేని ఈ సమయంలో గంటా పార్టీని చాలా లైట్‌ గా తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: