జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారా.. పవన్ కల్యాణ్ చేసింది తప్పు అని చెప్పకనే చెప్పేశారా.. పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టారా.. అవుననే అనిపిస్తోంది. ఎందుంకంటే.. ఇటీవల చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఆయన్ను నిలదీశారు. ఆ సందర్భంగా చంద్రబాబు రెచ్చిపోయారు.. గతంలో ఎన్నడూ లేనంతగా సహనం కోల్పోయారు.. ఏరా.. పోరా.. అంటూ ఏకవచనంతో రెచ్చిపోయారు.


ఇటీవల పవన్ కల్యాణ్‌ కూడా ఓ సభలో చెప్పులు చూపించి వైసీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు ఏమన్నారంటే.. నాకు సభ్యత అడ్డం వస్తుంది కాబట్టి చెప్పులు చూపించలేకపోయాను అన్నారు. అంటే పవన్‌ కళ్యాణ్‌ అసభ్యంగా వ్యవహరించాడని చంద్రబాబు ఒప్పుకున్నట్లే కదా అంటున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు కూడా చెప్పులు చూపించాలని కోరిక ఉన్నట్లుందని.. కానీ.. చంద్రబాబు కర్నూలు వెళ్లేటప్పుడే ఒక నిస్పృహతో వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


చంద్రబాబు పర్యటనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ ఆయనను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కర్నూలుకు న్యాయరాజధాని రావడానికి చంద్రబాబు అడ్డంకులు సృష్టించారని..  ఒకే రాజధానిని రాష్ట్రమంతా కోరుకుంటుందని చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం అబద్దం అని చెప్పేందుకే కర్నూలు ప్రజలు నిరసన తెలిపారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


న్యాయ రాజధాని విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటని కర్నూలు ప్రజలు ప్రశ్నించారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. చంద్రబాబుకి అదొక అవకాశం కూడా అన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రం మొత్తం ప్రజల మన్ననలు పొందాలనుకుంటే చంద్రబాబుకు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వాటికి ఆయన తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాలని... ప్రజలను కన్విన్స్‌ చేసుకోవాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: