ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓ చిన్నారి వైద్య చికిత్సల‌కు ఉదారత చూపారు. నిన్న న‌ర‌స‌న్నపేట‌లో వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న భూర‌క్ష రీస‌ర్వే ప‌త్రాలు పంపిణీ చేసేందుకు ఆయన వ‌చ్చారు. బహిరంగ సభకు వెళ్తూ కాన్వాయ్‌లో నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న పాప‌ను ఎత్తుకున్న త‌ల్లిదండ్రుల‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ గమనించి బాధితులను అక్కడే పరామర్శించారు. తమ కుమార్తె వైద్యానికి అవసరమైన సాయం చేయాలని విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి సీఎం జగన్‌కు విజ్ఙప్తి చేశారు.


తమ కుమార్తె ఏడేళ్ల ఇంద్రజ అనారోగ్య సమస్యను సీఎంకి కృష్ణవేణి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం జగన్ ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. జగన్‌ ఆదేశాలతో  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కేష్‌ బి లఠ్కర్ చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుతో  మాట్లాడారు.


చిన్నారి ఇంద్రజను ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో శ్రీకాకుళం జెమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించారు. ఈ ఆపరేషన్‌ ఎక్కడైనా సరే ఎంత ఖర్చయినా పూర్తిగా ప్రభుత్వమే భరించేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. త‌మ బిడ్డ ఆరోగ్యం ప‌ట్ల వెనువెంట‌నే స్పందించిన ముఖ్యమంత్రికి ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ సీఎం జగన్ సార్.. అంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.


సీఎం జగన్ కొన్నాళ్ల క్రితం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఓ చిన్నారి విషయంలోనే  ఇలాగే స్పందించారు. హనీ అనే చిన్నారికి.. కాలేయానికి సంబంధించిన అరుదైన గాకర్స్ బారిన పడితే.. తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి సీఎం జగన్ విజ్ఞప్తి చేసుకున్నారు.
సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా పది లక్షల విలువైన 13 ఇంజెక్షన్లు... తర్వాత నలభై లక్షలతో మరో 52 లక్షల ఇంజెక్షన్లు తెప్పించి అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: