
కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడం కేసీఆర్ సైనికుడిగా ఆనందంగా ఉందని.. తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభానికి హాజరవుతారని.. యుపి మాజీ సీఎం అఖిలేష్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను కార్యక్రమానికి ఆహ్వానించామని బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అంటున్నబీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతుల కోసం పేదల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారని వివరించారు. భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని.. తెలంగాణలో రైతుల కోసం 24 గంటల కరెంటు ఇస్తున్నారు.. ఉచిత కరెంటు దేశంలో ఇవ్వాలని భావిస్తున్నారని బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.
చిల్లర రాజకీయాల కోసం బీఆర్ఎస్ రాలేదన్న.. దేశంలో ప్రాజెక్ట్ లు కట్టి రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు, తాగునీరు ఇవ్వలేకపోతున్నారని.. దేశంలో మన పిల్లలకు యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని.. అనేక సమస్యలతో గత 50 సంవత్సరాలు నుంచి నలిగిపోతున్నటు వంటి దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు.