మన దేశంలో దగ్గు, జలుబు లేదా ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా యాంటీబయాటిక్స్ వేసుకోవడం చాలామందికి అలవాటు. ఎందుకంటే ఇక్కడ సులభంగా యాంటీ బయాటిక్స్ దొరుకుతాయి. మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకున్నా కానీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. అలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం తప్పని చెప్తున్నా.. మనం పట్టించుకోం. కానీ విదేశాల్లో పరిస్థితి మనతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అక్కడ యాంటీ బయాటిక్స్ షాపుల్లో అమ్మరు. డాక్టర్లు ఇస్తేనే తీసుకోవాలి.


ప్రస్తుతం యూరప్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, ఇటలీలో ఈ యాంటీ బయాటిక్‌ల  కొరత అధికంగా ఉంది. దగ్గు, గొంతునొప్పితో చాలా మంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. యాంటీ బయాటిక్స్ తోనే వ్యాధి నయం అవుతందని డాక్టర్లు తెలుపుతున్నారు. కాకపోతే అవి మాత్రం అక్కడ దొరకట్లేదు. గడిచిన 3 నెలల్లో సరైన టైంలో యాంటీబయాటిక్స్ లేక 15 మంది చనిపోయారంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


మరోవైపు హెల్త్ డిపార్ట్ మెంట్ మాత్రం మందుల కొరత లేదని ప్రకటనలు ఇస్తుంది. ఇది కార్పొరేట్ మెడికల్ వ్యవస్థ చేస్తున్న స్కామ్ అని వారిస్తుంది. అసలే.. శీతాకాలం.. దగ్గు, జలుబుతో మందులు లేక వేలాది మంది యూరోపియన్లు విలవిల్లాడుతున్నారు. వాస్తవానికి యూరప్ లో అధికారికంగా 3 నెలలుగా మందుల కొరత ఉంది. నెదర్లాండ్స్ కు కూడా ఎనర్జీ నిల్వలు లేక అక్కడ కూడా యాంటీ బయాటిక్స్ ఉత్పత్తి ఆగిపోయింది. రష్యా నుంచి వచ్చే గ్యాస్ కట్ అవడంతో ఎనర్జీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటుంది నెదర్లాండ్స్.


మరోవైపు చైనాలో కరోనా వ్యాప్తి అధికమైంది. అక్కడి నుంచి వచ్చే ముడి సరకు ఆగిపోయింది. దీంతో యాంటీబయాటిక్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. మరోవైపు పెన్సిలిన్ రేట్లు ఏకంగా 50 నుంచి 60 శాతం పెరిగాయి. సీజన్ టైంలో యాంటీబయాటిక్స్ లేక యూరప్ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: