తాను డ్రగ్స్ వాడతానని వచ్చి ఆరోపణలపై కేటీఆర్‌ తాజాగా స్పందిస్తూ.. ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని ప్రకటించడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. అయితే బండి సంజయ్ విమర్శలు చేసిన రెండేళ్ల తర్వాత కేటీఆర్ స్పందించారని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు, కుక్కలు మొరిగినట్టుంది కేటీఆర్ సవాల్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బండి సంజయ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.


రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసినప్పుడు... నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్ అని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నందుకే ఇవ్వలేదా.. ఏ డ్రగ్ తీసుకున్నా... ఆ డ్రగ్ ఆనవాళ్లు, మనిషి శరీరంలో డ్రగ్ ని బట్టి, 24 గంటలు, కొన్ని డ్రగ్స్ లో ఆరు నెలల నుంచి 9 నెలలు మాత్రమే ఉంటాయని  బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు... రెండేళ్ల క్రితం బండి సంజయ్ చేసిన సవాల్ కు స్పందించకుండా... ఇప్పుడు నువ్వు ప్రతి సవాల్ విసిరితే ఏం లాభం కేటీఆర్ అంటూ  బీజేపీ నేత డీకే అరుణ నిలదీశారు.


నువ్వు డ్రగ్స్ తీసుకున్న తర్వాత... మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పలేక,  విదేశాలకు వెళ్లి, డి అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాక...  నీ బాడీలో డ్రగ్ ఆనవాళ్లు ఏమి లేవని నిర్ధారించుకున్నాకే... దొంగ సవాల్ విసురుతున్నావా కేటీఆర్ అంటూ బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే.... మా బండి సంజయ్ చేసిన సవాల్ కు, అప్పుడే ఎందుకు స్పందించలేదని  బీజేపీ నేత డీకే అరుణ నిలదీశారు.


అప్పుడే నువ్వు నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ, లివర్ సహా నీ బాడీలో ఇంకా ఏమైనా పార్ట్స్ ఉంటే... అవి ఇవ్వకుండా... ఇన్ని రోజులు ఎందుకు ఆగావు కేటీఆర్ అంటూ బీజేపీ నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన బండి సంజయ్ పై ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనమని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. సీఎం కొడుకై ఉండి, భవిష్యత్ సీఎం నువ్వే అని ప్రచారం చేయించుకుంటున్న నువ్వే... ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... ప్రజలే నిన్ను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయన్నారు  బీజేపీ నేత డీకే అరుణ.


మరింత సమాచారం తెలుసుకోండి: