లోకేష్ పాదయాత్ర గాని.. పవన్ బస్సు యాత్ర గాని.. చేయబోతున్నారంటే కారణం ఒకటే. అది టార్గెట్ జగన్. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించడమే వారి ముందున్న అతి ప్రధానమైన లక్ష్యం. తర్వాతే ఎవరికి వారు గెలవడం అనేది. లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడు ను దృష్టిలో పెట్టుకుని పాదయాత్రకు సిద్ధమవుతుంటే, పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను సీటు నుండి దింపేయడానికి.. సర్వశక్తులు ఒడ్డి పోరాడటానికి సిద్ధమవుతున్నాడు. దీన్నే "భావ సారూప్యత" అంటారు.


పవన్ ఇంకా లోకేష్ ఇద్దరి భావం జగన్ ను గద్దె దించడమే కాబట్టి. జనం మద్దతు ఇస్తే తానే సీఎం అవుతానని.. పవన్ కళ్యాణ్ అంటున్నారు గానీ, తాను సీఎం అయినా కాకపోయినా జగన్ మాత్రం సీఎం అవ్వకూడదనే ఉద్దేశం అది. ఇక బిజెపిని ఎటూ ఇక్కడ గెలిచే అవకాశం లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్. అది ఇక్కడ సొంతంగా పట్టు సాధించాలనుకునే టైంలో పవన్ కళ్యాణ్ వెళ్లి బిజెపితో కలిశాడు. ఇప్పుడు బిజెపి ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా.. గెలిచే అవకాశం అయితే చాలా కష్టం. ఈ ప్రయత్నం అంతా పవన్ కళ్యాణ్ ఎందుకు చేశారంటే.. బిజెపి ఎక్కడ జగన్ ను గెలిపిస్తుందో అన్న సందేహంతోనే, ముందు జాగ్రత్త తోనే.


ఇంతకు ముందు జగన్ను సీఎం కాకూడదని రెండుసార్లు ప్రయత్నించారు కానీ, జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం పవన్ కు నచ్చడం లేదు. అందుకే ఈసారి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకే అసలు రెడ్డి వర్గాన్ని గెలుపు రేసులో ముందుకు రానివ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు కమ్మ వర్గం ఇంకా కాపు వర్గం వారి వారి మధ్య ఉన్న విద్వేషాలను కూడా పక్కన పెట్టి మరీ కలిసిపోతున్నారు. ఈ యాంటీ జగన్ అనే.. మూకుమ్మడి కాన్సెప్ట్ ఎంతవరకు టిడిపికి లేదా జనసేనకు కలిసివస్తుందో, దానికి సమాధానం చెప్పాలంటే.. అది చెప్పడానికి మరో కొత్త సంవత్సరం 2024 రావాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: