
అలాగే ఏపీ నుంచి మాగుంట తెలంగాణ నుంచి కవిత, ఢిల్లీ నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువమంది ఉన్నారు. గతంలో రాజకీయ నాయకులు బినామీలను పెట్టుకొని వ్యాపారాలను కొనసాగించుకునేవారు. నేరుగా వ్యాపారం చేయడానికి కూడా ఇబ్బంది పడేవారు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకుల రూటు మారిపోయింది. డైరెక్ట్ గా వ్యాపారాలను చేస్తున్నారు. కాంట్రాక్టులను తీసుకుంటున్నారు.
గతంలో ఏదైనా కాంట్రాక్టు చేపడితే దానిని తన అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకొని ఆ తర్వాత దాని నుండి కమిషన్ తీసుకునేవారు. ఇలా డబ్బులను సంపాదించుకునే వారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం లో ప్రత్యక్షంగా వారే రంగంలోకి దిగడం సంచలనమే. ఈ లిక్కర్ స్కాం లో ఫేస్ యాప్ ద్వారా మాట్లాడుకున్నట్లు ఈడి కనిపెట్టింది. ఫోన్ ద్వారా మాట్లాడితే తెలుస్తుందని ఒక ఫేస్ యాప్ అనే సోషల్ యాప్ ద్వారా వీరు రహస్య మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది.
ఫోన్ అయితే ట్యాపింగ్ చేయొచ్చు. ఈ సోషల్ యాప్ లను ట్యాపింగ్ చేయడం కుదరదు. కాబట్టి దీనిని ఎంచుకొని రాజకీయ నాయకులు ఢిల్లీ లిక్కర్ స్కాం ను నడిపించారు. మరి ఆ యాప్ సంస్థ డేటా ఈడీకి ఇస్తుందా ఇవ్వదా అనేది తెలియాలి. మొత్తం మీద ఈ లిక్కర్ స్కాం అక్రమాలు చేయడానికి సరికొత్త మార్గాన్ని చూపించినట్లు అయింది.