జగన్ బస్సు యాత్రకు అంతా సిద్ధమవుతుంది. రోజుకు రెండు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తిరగబోతున్నారాయన. ఇంకా 5 మండల పరిధుల్లో కూడా తిరగబోతున్నారు. ఈ లోపు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకొనే పనిలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఒక 23 మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం బాగోకపోవడంతో ఆ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో కొత్తవారిని నియమించక తప్పని పరిస్థితి. వారితో కూడా పార్టీ తరఫున అదే చెప్పుకుంటూ వస్తున్నారు.


అందులో కొంత మంది బయటకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా,మరి కొంత మంది మాత్రం తమ పనితీరు మెరుగుపరుచుకొని పార్టీలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. బయటికి వెళ్లే వాళ్లని వెళ్లొచ్చని కూడా వారు చెప్పేసినట్టుగా తెలుస్తుంది. కానీ వారిలో కొంతమంది చివరి అవకాశం కోసం ప్రాధేయపడుతున్నట్లుగా తెలుస్తుంది. రేపో మాపో జరగబోతున్న పార్టీకి సంబంధించిన ఫైనల్ మీటింగ్ లో దీని గురించి ఒక తుది నిర్ణయానికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా పార్టీకి సంబంధించిన ఆయా నియోజకవర్గాల్లో బస్సు యాత్రను ప్రారంభించడానికి సిద్ధంగా సన్నాహాలు చేసుకుంటున్నారు  వైసిపి శ్రేణులు.


ఒక నియోజకవర్గ పరిధిలో పర్యటన ముగిసిన తర్వాత అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలా రోజుకి రెండు నియోజకవర్గ పరిధిలో పర్యటన చేస్తూ, అలానే రోజుకు రెండు సమావేశాలు కూడా జరిగేటట్లుగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది జగన్ పర్యటన గురించి తాజాగా వినపడుతున్న సమాచారం.


ఒకవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు పాదయాత్రలని, బస్సు యాత్రలని మొదలుపెట్టే క్రమంలో ఉండగా, మరొక పక్కా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వారాహి ప్రచార బస్సులో పర్యటనను మొదలు పెడుతున్నారు. ఇప్పుడు జగన్ కూడా తన ప్రచార యాత్రకు రంగం సిద్ధం చేస్తుండడంతో ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల ద్వారా  ప్రజల్లోకి వెళ్లి వేడిని రేకెత్తించడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: