ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. త్వరలో 14 స్థానాలకు ఎమ్మెల్సీ  ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే.. 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా వైకాపాకే వస్తాయని సీఎం జగన్ అంటున్నారట. అలాగే  3 పట్టభద్రులు,  2టీచర్ నియోజకవర్గాల ఎమ్మె ల్సీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు  తప్పక గెలిచి తీరాలని సీఎం పార్టీ నేతలను ఆదేశించారట. ఈ విషయం మాజీ మంత్రి కొడాలి నాని  చెబుతున్నారు.


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నా పర్సెంటేజీ తక్కువగా ఉందని సీఎం చెప్పారన్న మాజీ మంత్రి కొడాలి నాని ... గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని నన్ను సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తప్పక  గెలవాలని సీఎం ఆదేశించారన్న మాజీ మంత్రి కొడాలి నాని.. మార్చి18నుంచి ''జగనన్నే మా భవిష్యత్తు'' పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

 
అయితే.. ఎమ్మల్సీ ఎన్నికల కోడ్  జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి మాకు అడ్డుకాదని.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారని.. మాజీ మంత్రి కొడాలి నాని  తెలిపారు. "జగనాసుర చరిత్ర'' పేరిట  తెదేపా వేసిన పుస్తకాలు చలి మంట వేసుకునేందుకు పనికి వస్తాయన్న మాజీ మంత్రి కొడాలి నాని ..  "తడిగుడ్డతో గొంతు ఎలా కోయాలి ''అనే పుస్తకాన్ని తెదేపా నేతలు రాయాలని.. సూచించారు. వివేకాను చంపడం వల్ల పైసా ఆస్తి కూడా జగన్ కు కలవలేదని.. ఏం ప్రయోజనం ఉందని వైఎస్ వివేకాను  వైఎస్ జగన్ ఎందుకు చంపుతారని మాజీ మంత్రి కొడాలి నాని  ప్రశ్నించారు.


వివేకానందరెడ్డి ని చంపితే కుటుంబ సభ్యులకు ఏమి వస్తుందని మాజీ మంత్రి కొడాలి నాని  ప్రశ్నించారు. వైఎస్ వివేకా బతికి ఉన్నా కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డికే సీఎం జగన్ ఇచ్చేవారని.. కడప ఎంపీ సీటుకోసం వివేకాను ఎందుకు చంపుతారని.. వివేకా చనిపోయే నాటికి ఆయన పేరిట ఉన్న ఆస్తులు కూతుళ్లు, అళ్లుళ్లకే దక్కిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎంగా చంద్రబాబు ఉన్నందునే గతంలోవివేకా హత్యపై  సీబీఐ విచారణ అడిగామని..  వైఎస్ జగన్ సీఎం అయ్యాక  రాష్ట్ర ప్రభుత్వమే నిస్పాక్ష పాతంగా విచారణ జరుపుతుందనే  సీబీఐ వద్దన్నామని మాజీ మంత్రి కొడాలి నాని  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: