ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు ఉన్న గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ పై సెటైర్లు వేస్తూ ఆయన ఒక అసమర్ధుడని వ్యాఖ్యానం చేసే వేళ నజీర్ ని ఎప్పుడైతే మార్చారో తెలుగుదేశం అనుకూల మీడియా అంతటా కూడా విపరీతమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 80:20 రేషియోలో ఉన్నటువంటి మీడియా 20శాతం జగన్ కి అనుకూలంగా  80 శాతం జగన్ కి వ్యతిరేకంగా ఉన్న మీడియా గవర్నర్ మార్పు కి సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే, జాతీయ మీడియా లో మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియామకం అన్నది మాత్రం పెద్ద చర్చకు తావిచ్చింది.


ఏకంగా కాంగ్రెస్ పార్టీ, ఇంకా తృణమూల్ కాంగ్రెస్ వీరిద్దరూ కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారే. వాళ్లు ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమిటి అంటే సుప్రీంకోర్టు జడ్జిగా చేసి బిజెపికి అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకే ఈ నజరానా ఇచ్చారంటూ విమర్శలు చేస్తున్న వాళ్లలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తో పాటుగా, కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడం కీలకం. ఆంధ్ర రాజకీయం ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాత్ మొయిత్రా ఏపీకి కొత్త గవర్నర్ నియమకాన్ని ఆధారం చేసుకుని విమర్శలు చేశారు.


సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమిస్తూ జారీ చేసిన నియామకంపై మాట్లాడుతూ, మెజార్టీ ప్రభుత్వం అవగాహన గురించి పట్టించుకోదు కానీ మీరు ఎంత సిగ్గు లేనోళ్లు మిలార్డ్ దీన్ని అంగీకరించాలా అంటూ మహువాత్ అంటున్నారు.  జస్టిస్ నజీర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన 40 రోజుల్లోనే గవర్నర్ గా నియమితులైనారు అనే పాయింట్ ఇక్కడ రేకెత్తించారు. 2019లో రామ జన్మభూమి పై తీర్పు చెప్పిన ఐదుగురి సభ్యుల ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ ఒకరు. డిమానిటైజేషన్ ని సమర్థించిన ధర్మాసనంలో కూడా జస్టిస్ నజీర్ నేతృత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: